Neelanti kannulu Song Lyrics | నీలాంటి కన్నులు Song Lyrics - Telugu christian song Lyrics

Singer | Shailaja |
నీలాంటి కన్నులు - నీలాంటి చేతులు
నీలాంటి హృదయము - నాకిమ్మయా - 2
నీలా చూచుటకు - నీలా తాకుటకు
నీలా స్పందించుటకు - యేసయ్యా - నీలా ప్రేమించుటకు
1. నీకై నేను పరిమళ వాసనగా - పరిశుద్ధతలో కడవరకూ నిలచి -
నాలో నిన్ను - లోకానికి చూపించుటకొరకు
నాలో నీవే జీవించుమయ్యా - బ్రతుకుకు అర్ధం నీవే కావయ్యా - 2
2. నీవే వెలుగై నన్ను వెలిగించితివి - వెలుగుగా నన్ను లోకంలో
ఉంచితివి - 2
మనసే మందిరమై - పరిశుద్ధత కొలువై వసియించితివి
నీలా ఇతరుల ప్రేమించుటకు - ప్రేమను పోతగా నాలో పోయుము - 2