Aakasame Pattanodu Song Lyrics | ఆకాశమే పట్టనోడు Song Lyrics - Revanth | Telugu Christmas Songs Lyrics

Singer | Revanth |
అవనిలో ఉద్భవించే ఆదిసంభూతినిచూడరే
పుడమియే పరవసించే పసిబాలుని చూడగనే
పసిబాలుని చూడగనే
ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై వెలసినాడు రక్షకుడు
ఆనందమే మహా ఆనందమే-అందరికి ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే-యేసు జననం అద్భుతమే(2)
1.అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు
ఆది అంతమైన పరలోక నాధుడు
ఆదియందు వాక్యంబుగా సృష్టి కార్యము జరిగించినాడు
ఆనాది నుడి జ్ణానంబుగా సృష్టి క్రమము నడిపించినాడు(2)
అన్నిటిని కలిగించిన మహరాజు కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు(2)
ప్రేమను పంచే ప్రేమామయుడు రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు
2.పాపమే లేని సుగుణాల సుందరుడు
శాపము బాపము జన్మించెను చూడు(2)
నిత్యముండు నీతి సూర్యుడు-సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు
ప్రేమను పంచే పావనాత్ముడు-పశుల పాకలో పవళించినాడు
సర్వాధికారి ఐన మహరాజు -దీనులకు దీవెనగా దిగివచ్చినాడు(2)