Type Here to Get Search Results !

సుధా మధుర కిరణాల అరుణోదయం | sudhamadhura kiranala arunodayam Song Lyrics | Old Telugu Christmas Songs Lyrics

సుధా మధుర కిరణాల అరుణోదయం | sudhamadhura kiranala arunodayam Song Lyrics - Anjana sowmya | Old Telugu Christmas Songs Lyrics

Singer Anjana sowmya

సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణం అరుణోదయం (2)
తెర మరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది (2) ||సుధా||

దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని (2)
నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని (2)
ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది
పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2)
నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ (2) ||సుధా||

లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2)
క్షమ హృదయ సహనాలు సమపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2)
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే
నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2)
ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము (2) ||సుధా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area