విడువని దేవుడ నీవే | Viduvani Devuda Neeve Song Lyrics - Akumarthi Daniel Songs Lyrics
Singer | Akumarthi Daniel |
విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా
పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా
ప్రేమించుటకు క్షమియించుటకు
రక్షించుటకు అర్హుడ నీవే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నలువది సంవత్రరములు మా పితరుల నడిపిన దేవా
అరణ్య మార్గమైనా అన్నీ నీవైనావు (2)
జీవాహారమై ఆకలి తీర్చావు
కదిలే బండవై దాహము తీర్చావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
ఇత్తడి సర్పమువోలే పైకెత్తబడినావు
నిన్ను చూచినవారు ఆనాడు బ్రతికారు (2)
సిలువపై వ్రేలాడే నీ దరి చేరిన
జనులందరు నేడునిత్యము బ్రతుకుదురు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా