శాశ్వతమా ఈ దేహం | Saswathama e deham song lyrics | Old Christian Songs - P Suseela Lyrics
Singer | P Suseela |
శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా
1. క్షణికమైన ఈ మనుగడలో పరుగులేలనో అనుక్షణం
నీటిపైది చిరు బుడగవోలె దేహము ఏవేళ చితికిపోవునో
2. ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనివితీరేనా
ఈ తనువే రాలిపోయిన నీ గతి ఏమో నీకు తెలియునా
3. దేహ వాంఛలను దూరముచేసి ఆ ప్రభుయేసుని శరణముకోరి
నీతి మార్గమున నడచుకొందువో చిరజీవముతో తరియించేవు