Pathrudanu Kaanayya Song Lyrics | పాత్రుడను కానయ్యా - Br. Nissy John - KY Ratnam Songs Lyrics
Singer | Br. Nissy John |
పల్లవి
పాత్రుడను కానయ్యా అర్హతే లేదయ్యా
నీ ప్రేమను నాపై చూపినావయ్యా
యేగ్యడను కానయ్యా యేగ్యతే లేదయ్యా
నీ ప్రాణమే నాకై పెట్టినావయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
చరణం 1
ఆవేదన నాది ఆనందమునిచ్చావు
అవమానము నాది అభిషేకమునిచ్చావు
అపనిందలు నావి ఆలంబననిచ్చావు
అపజయమే నాది జయమునిచ్చినావు
నా కన్నీరు...
నా కన్నీరు తుడిచావయ్యా
నాట్యముగా మార్చావయ్యా
యేసయ్యా యేసయ్యా నా నాట్యము నీవేనయ్యా
చరణం 2
అజ్ఞానము నాది నీ జ్ఞానమునిచ్చావు
అవివేకము నాది ఆలోచన చెప్పావు
పాపము నాది పరిశుద్ధతనిచ్చావు
రోగమే నాది రాగముగా మార్చావు
నా చీకటిని...
నా చీకటిని తీశావయ్యా వెలుగుగా మార్చావయ్యా
యేసయ్యా యేసయ్యా నా వెలుగువు నీవేనయ్యా
చరణం 3
బలహీనత నాది నీ బలమును ఇచ్చావు
దారిద్రత నాది దాతృత్వమునిచ్చావు
భయభ్రాంతులు నావి నీ ధైర్యమునిచ్చావు
మరణమే నాది అమరత్వమునిచ్చావు
నా గమనమును...
నా గమనమును మార్చావయ్యా నా గమ్యము నీవేనయ్యా
యేసయ్యా యేసయ్యా నా గమ్యము నీవేనయ్యా