Rajadhi Raja Ravikoti Teja Song Lyrics | రాజాధి రాజ రవి కోటి తేజ - Ps. John Wesly - Hosanna Song Lyrics

Singer | Ps. John Wesly |
రాజాధి రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రజ్య పరిపాలక
విడువని కృప నాలో స్దాపించెనే సీయోనులోనున్న స్తుతుల సింహాసనమును
1) వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును నాకొరకే త్యాగముచేసి
కృపాసత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెద
2) ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశ్యములను నా యెడల సఫల పరచి
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరణిలో
3) మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే