నీవే నీవే | Neeve Neeve Song Lyrics - Bro. Mathews | Krupa Ministries Songs Lyrics
Singer | Bro. Mathews |
నీవే నీవే నా ప్రాణ ప్రియుడవు
నీవు లేని క్షణమే అంధకారము
ప్రభువా నీవు లేని క్షణమే అంధకారము. ”2”
అరణ్య మార్గములో అలిసిపోయి నేను
దిక్కు తోచకా భయమొందితిని. ”2”
నా యెదుటే నిలిచి నన్నాకర్షించి
ప్రియముగా మాట్లాడితివే. - ప్రభువా
ప్రియముగా మాట్లాడితివే. "నీవే"
గాలి వాన చేత కొట్టబడిన స్థితిలో
ఆదరణే లేక రోధించితిని. "2"
నా యెదుటే నిలిచి - నా మీద జాలి చూపి
నా కృపా విడువదంటివే ప్రభువా
నా కృపా విడువదంటివే. "నీవే"
గాడాంధా కారపు లోయాలెన్నో ఎదురై
నడువలేక నేను కృoగిపోతిని. "2"
నా కాపరి నీవై నా త్రోవకు వెలుగై
నా చేయి విడువకంటివే . - ప్రభువా
నా చేయి విడువకంటివే. " నీవే"