Nee mandiram Song Lyrics | నీ మందిరం అతి సుందరం - Sis. Akshaya | Ps. Praveen Songs Lyrics
Singer | Sis. Akshaya |
నీ మందిరం అతి సుందరం - నీ తేజస్సు నిలిచే మధుర స్టలం ( 2 )
అ. ప
నీ కృపను పొందే కృప గల స్థలం
నీ ప్రేమ పొందే కరుణాస్థలం ( 2 )
నీవు కోరుకున్న ఈ మందిరం - నీ నామ ఘనతకు ఈ మందిరం ( 2 )
1. పాపములో ఉన్న ప్రజలందరు - పరిశుద్ధులుగా మార్చే ఆశ్రయపురం
శాపములో బ్రతికే నీ ప్రజలను - ఆశీర్వదించే అంత:పురం ( 2 )
ప్రతి ప్రార్ధన ఆలకించి ప్రతి వారికి నీ స్వరము వినిపించే ఈ గోపురం ( 2 ) ( నీ కృపను )
2. కష్టాలలో ఉన్న నీ జనులను - ఓదార్పు నిచ్చే విశ్రమ స్థలం
వ్యాధులలో ఉన్న ప్రతి వారికి ఆరోగ్య మిచ్చే స్వస్థత స్థలం ( 2 )
ప్రతి బంధకములను తొలగించెడి
రక్షణను కలిగించెడి కల్వరి పురం ( 2 ) ( నీ కృపను )