నా పేరే తెలియని ప్రజలు | Naa Pere Teliyani Prajalu Song Lyrics - Bro. Surya Prakash Lyrics
Singer | Bro. Surya Prakash |
నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప - కొందరే ఉన్నారు } 2
ఎవరైనా - మీలో ఎవరైనా - ఎవరైనా - మీలో ఒకరైనా
వెళతారా - నా ప్రేమను చెబుతారా } 2|| నా పేరే ||
రక్షణ పొందని ప్రజలు - లక్షల కొలది ఉన్నారు
మారుమూల గ్రామాల్లో - ఊరి లోపలి వీధుల్లో } 2|| ఎవరైనా ||
నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేసారు
వెళతామని చెప్పి - వెనుకకు తిరిగారు } 2|| ఎవరైనా ||
వెళ్ళగలిగితే మీరు - తప్పక వెళ్ళండి
వేల్లలేకపోతే - వెళ్ళేవారిని పంపండి } 2|| ఎవరైనా ||