Type Here to Get Search Results !

ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార | Praneswara Prabu Daiva Song Lyrics | Hosanna Ministries Songs Lyrics

ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార | Praneswara Prabu Daiva Song Lyrics - Sis. Betty Sandesh | Hosanna Ministries Songs Lyrics

Singer Sis. Betty Sandesh

ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార
ప్రణుతింతును నిన్నే- ఆశతీర
ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార

నా ఆత్మతో పాటలు పాడ - నీ కృపలే నాకు హేతువులాయె -2
నిత్య నిబంధన నీతో చేసి - నీ పాద సన్నిధి చేరియున్నానే -2
॥ ప్రాణేశ్వర ॥

నా ఊటలన్నియు నీ యందేనని - వాద్యము వాయించి పాడెదను -2
జీవిత కాలమంతా నిన్నే స్తుతించి - సాగెద నూతన యెరూషలేము -2
॥ ప్రాణేశ్వర ॥

కమనీయమైన నీ దర్శనము - కలనైనను మెలకువనైన -2
కనబడినా నా ఆశలు తీరవే - కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి -2
॥ ప్రాణేశ్వర ॥



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.