కుమ్మరి చేతిలో మంటి వలె | Kummari Chethilo Manti Vale Song Lyrics - Ps. Moses | Telugu Christian Songs Lyrics
Singer | Ps. Moses |
కుమ్మరి చేతిలో మంటి వలె
తల్లి ఒడిలో పసి బిడ్డ వలె (2)
అయ్యా నీ కృపతో నన్ను మార్చుము
యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము ||కుమ్మరి||
నాలోని స్వయమును నలుగ గొట్టుము
నాలోని వంకరలు సక్కగా చేయుము (2)
నీ పోలిక వచ్చే వరకు
నా చేయి విడువకు (2)
సారె పైనుండి తీసివేయకు (2) ||కుమ్మరి||
నాలోని అహమును పారద్రోలుము
నాలోని తొందరలు తీసి వేయుము (2)
నీ భుజముపై ఆనుకొనే
బిడ్డగా మార్చుము (2)
నీ చేతితో నడిపించుము (2) ||కుమ్మరి