ఆ భోజన పంక్తిలో | Aa bhojana Pankthilo Song Lyrics - Sis. Nissy Paul Songs Lyrics
Singer | Sis. Nissy Paul |
ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో
అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను (2)
కన్నీళ్లతో పాదాలు కడిగింది
తన కురులతో పాదాలు తుడిచింది (2)
సువాసన సువాసన ఇల్లంత సువాసనా
ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2)
జుంటి తేనె ధారల కన్నా మధురమైనది వాక్యం
ఆ వాక్యమే నన్ను బ్రతికించెను (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన
ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2) ||ఆ భోజన||
సింహాల నోళ్లను మూసినది ఈ వాక్యం
దానియేలుకు ఆపై విడుదలిచ్చె ఈ వాక్యం (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన
ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2) ||ఆ భోజన||