నీవు లేనిదే నే లేను | Neevu Lenide Ne Lenu Yesayya Song Lyrics - Sis. Esther | Latest Christian Songs 2022 Lyrics
Singer | Sis. Esther |
నీవు లేనిదే నే లేను యేసయ్య నీవే నా జీవము
నీ కృప లేకపోతే నే బ్రతుకలేను నీ ప్రేమే శాశ్వతం(2)
అద్వితీయుడా ఆరాధ్య దేవుడా(2)
నీవే నాకు ఆశ్రయ దుర్గము నీవే నాకు రక్షణ శృంగము. "నీవు లేనిదే"
1. గర్భములో ఉన్నది మొదలు కాపాడింది నీ ప్రేమ
పిండము గా రూపింపక
మునుపే ఎన్నుకున్నది నీ ప్రేమ (2)
నీ ప్రేమ లేక పోతే ఏమైపోదునో ఏసయ్య
నీ కృప లేకపోతే నా బ్రతుకు శూన్యం యేసయ్య....(2)
2. దీన స్థితిలో ఉన్న నన్ను హెచ్చించింది నీ ప్రేమ
వాగ్దానము నే వరముగ ఇచ్చి ఆదరించిన నీ ప్రేమ (2)
కన్నీటిని తుడిచి కౌగిట చేర్చి కనికరించిన నీ ప్రేమ
నే జీవించుచున్నానంటే దానికి కారణం నీ ప్రేమ.....(2)
కారణం నీ ప్రేమ. "నీవు లేనిదే"