యేసూ.. నీ కార్యములు | Yesu nee karyamulu ento goppavi Song Lyrics - Bro. Sunil Song Lyrics

Singer | Bro. Sunil |
యేసూ.. నీ కార్యములు – ఎంతో గొప్పవి
తండ్రీ.. నీ తలంపులు – లెక్కలేనివి = 2
అవి కంటికి కనపడవు – హృదయానికి అంతుచిక్కవు – 2
1. కానావిందులో ఒకేమాటతో – అద్భుతముచేసితివీ
చేపకడుపులో ఆశ్చర్యముగా – యోనాను ఉంచితివీ = 2
“అవి కంటికి కనపడవు”
2. షద్రకు, మేషాకు, అబేద్నెగోలతో – అగ్నిలో నిలచితివీ
దానియేలుకు సింహపు బోనులో – విజయమునిచ్చితివీ = 2
“అవి కంటికి కనపడవు”
3. పౌలు సీలలు ప్రార్ధించగా – చెరసాల బ్రద్దలాయెనే
గొర్రెల కాపరి దావీదును – రాజును చేసితివీ = 2
“అవి కంటికి కనపడవు”