Type Here to Get Search Results !

నిత్యం నిలిచేది | Nithyam nilichedi Song Lyrics | Bro. Sunil Songs

నిత్యం నిలిచేది | Nithyam nilichedi Song Lyrics - Bro. Sunil Song Lyrics

Singer Bro. Sunil

నిత్యం నిలిచేది – నీ ప్రేమే యేసయ్యా
నిలకడగా ఉండేది – నీ మాటే యేసయ్యా (2)
నాతో ఉండేది – నీ స్నేహం యేసయ్యా
నాలో ఉండేది – నీ పాటే యేసయ్యా (2) ||నిత్యం||

మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి
విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2)
నీకెవరూ సాటే రారయ్యా
నీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా (2) ||నిత్యం||

ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా
అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా (2)
నిజమైన స్నేహం నీదయ్యా
నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా (2) ||నిత్యం||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area