ఎన్నో ఉన్నాగాని నాకన్నీ నీవే యేసు | Yenno vunna gani naakanni neeve yesu Song Lyrics - Bro. Sunil Song Lyrics
Singer | Bro. Sunil |
ఎన్నో ఉన్నాగాని నాకన్నీ నీవే యేసు
అంతా ఉన్నాగాని నాసొంతం నీవే యేసు....!!
ఏడాబాయని దేవుడు నీవే ననువీడని దేవుడు నీవే
ప్రేమించే దేవుడు నీవే క్షమియించే దేవుడు నీవే
లోకాన ఏదేమున్న నీ సన్నిధి చాలయ్యా.....!! ఎన్నో
1. భవనాలు నాకెనున్నా, బంగారం బోలెడు ఉన్నా
నిజమైన ఆనందం లేనే లేదయ్యా
దనరాసులు పొర్లుతుఉన్నా, బాగ్యాలు ఎన్నో ఉన్నా
నిజమైన సంతోషం నీవే యేసయ్యా...!!
నీతో ఉంటే చాలు కొదువేమి ఉండదయ్యా
నీతోనే సహవాసం చేస్తాను యేసయ్యా....!! ఎన్నో
2 లోకంలో బలమెంతున్నా, అధికారం నా చెంతున్నా
నాలో నువు లేకుంటే అంతా వ్యర్థమయ్యా
దానాలు చేస్తూ ఉన్నా, నలుమూలలు తిరుగుతు ఉన్నా
నీ రక్షణ లేకుంటే అంతా శూన్యమయ్యా.....!!
నీవైపే నా మనసు ఉంచాను యేసయ్యా
నీతోనే నా అడుగులు వేస్తాను యేసయ్యా...!! ఎన్నో