సమయము లేదు | Samayam ledu gadachina kalam Song Lyrics | Christian Gospel Song Lyrics
సమయము లేదు
గడచిన కాలము రాదు -2
ఈ క్షణమే... ఈ క్షణమే
నీకై ప్రాణం పెట్టిన యేసునీ తెలుసుకో
నీకై చేతులు చాచిన దేవుని చేరుకో - 2
సమయము లేదు
గడచిన కాలము రాదు - 2
1.
నిజ దేవుని ఎరుగని జీవితము
ఎంత కాలమైనా...
దాని వైభవము దుఃఖము రా...
విశ్వాసము లేని నీ క్రియలు
ఎంత గొప్పవైన...
అవి చివరకు మృతమవు రా...
నేత గాని నాడే కన్నా...
గాలికెగురు పొట్టు కన్నా...
వడి వడిగా గతిస్తున్నదీ జీవితం
ఫలము లేక నశిస్తున్నవీ క్రియలు - 2
తెలుసుకో... నేస్తమా
నీ దినముల అంతము... ఎట్లుందనీ - 2 || సమయము ||
2.
జీవాత్ముడు లేని దేహము
ఎంత అందమైనా...
అది మట్టిలో కలిసి మన్నవు రా...
ప్రాణ దాత నెరుగానీ ఆయువు
దీర్ఘ కాలమున్నా...
అది గాలికి రాలు గడ్డి పువ్వే రా...
అడవి గడ్డి పూచ కన్నా ...
ఉనికి లేని పువ్వు కన్నా ...
వేగమే మట్టిగ మారుతున్నదీ దేహము
త్వరగా వాడి పోవుచున్నదీ ఆయువు
తెలుసుకో...సోదరా
బ్రతుకుట క్రీసైతే ... చావుట మేలనీ || సమయము ||