Type Here to Get Search Results !

స్తుతి పాడుటకే బ్రతికించిన | Sthuthi Padutake Brathikinchina Song Lyrics | Hosanna Ministries Songs

స్తుతి పాడుటకే బ్రతికించిన | Sthuthi Padutake Brathikinchina Song Lyrics - Ps. John Wesly | Hosanna Ministries Lyrics

Singer Ps. John Wesly

స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్ళుగా నన్ను పోషించినా
తల్లివలె నన్ను ఓదార్చినా
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా - 2
జీవితకాలమంతా ఆధారం నీవెనయ్య
నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును

ప్రాణభయమును తొలగించినావు
ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు - 2
నీ కృపా బాహుళ్యమే - వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున - నూతన బలమిచ్చెను

నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు
కనుమరుగాయెను నా దుఃఖదినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు - 2
నీ దివ్య సంకల్పమే - అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై - నిరీక్షణ కలిగించెను

హేతువులేకయే ప్రేమించినావు
వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు - 2
నీ ప్రేమ మాధుర్యమే - నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతిస్థలమున - పారెను సెలయేరులై



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area