నిను వీడి నేనుండలేను | Ninu veedi nenundalenu Song Lyrics - Nitya Santhoshini | Joshuva Shaik Song Lyrics
Singer | Nitya Santhoshini |
॥ పల్లవి ॥ నిను వీడి నేనుండలేను
యేసయ్యా ... నిను వీడి నేనుండలేను
నా హృదయములో నిను కొలిచెదను
నా పాటతో నిను ఆరాధింతును
యేసయ్యా ... నిను వీడి నేనుండలేను
1. నీదు ప్రేమ తోటలో ఓ పూవునై పరిమళించాను
నీదు కరుణ సంద్రములో ఓ బాటసారినై పయనించాను
నీలో ఒదిగాను.... నిన్నే పూజింతును
యేసయ్యా ... నిను వీడి నేనుండలేను
॥ యేసయ్యా ||
2. నీదు రుధిరములో ఓ పాపినై గతియించాను
నీదు త్యాగములో ఓ సాక్షినై ఉదయించాను
నీలో లీనమయ్యాను... నిన్నే ప్రార్థింతును
యేసయ్యా... నిను వీడి నేనుండలేను
॥ యేసయ్యా ||
3. నీదు ముఖ కాంతిలో ఓ దీపమునై ప్రకశించాను
నీదు ఆలయములో ఓ సంకీర్తనై ఆలపించాను
నీలో తేజరిల్లాను ... నిన్నే సేవింతును
యేసయ్యా... నిను వీడి నేనుండలేను
॥ యేసయ్యా ||