ఎంత మురిసినా అందమా | Murisi Poke O Andama Song Lyrics - Bro. Mark | Gospel Song Lyrics
Singer | Bro. Mark |
ఎంత మురిసినా అందమా...ఆ...ఆ...
నిన్ను మట్టిలో పెడతారే అందమా.....
అందమా......అందమా...
మురిసిపోకే ఓ అందమా-నీవు మురవబోకమ్మా అందమా
ఎంత మురిసినా అందమా నిన్ను మట్టిలో పెడతారే అందమా
ముసిముసి నవ్వులు అందమా నీవు నవ్వమాకమ్మా అందమా
నిన్ను నమ్ముకొని అందమా నట్టేట మునిగారే అందమా
అందమా నీవు మురిసిబోకే అందమా నీవు మురువాబోకే అందమా నీవు ఎగసిపడకే అందమా... (2)
1.ఉదయకాలమున అందమా ఎంతో పచ్చంగ ఉంటావే అందమా
మధ్యాహ్నమందున అందమా నీవు మాడిపోతావమ్మా అందమా
అద్దము ముందర అందమా ఎంతో అందంగ ఉంటావే అందమా
అరగంటలోనే అందమా నీవు ఆవిరైపోతావే అందమా
పాండ్సురుద్దిన ఓ అందమా పాసి వాసనోస్తాదమ్మా అందమా(2)
బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివమ్మా అందమా
రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా "అందమా"
2.ACలొ ఉంటే అందమా-ఎంతో సక్కంగ ఉంటావే అందమా
నీడకు ఉంటే అందమా నిగనిగ లాడుతావందమా
బ్యూటీపార్లర్ లోన అందమా ఎంత బ్యూటీగా ఉంటావే అందమా
మ్యాచింగేసుకొని అందమా నీవు మనసు దోచుకుంటావందమా
మరచిపోకే ఓ అందమా ఇది మూడునాళ్ళముచ్చటందమా "2"
బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివమ్మా అందమా
రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా "అందమా"
3.వయసు మీద పడితే అందమా నీకు ముడతలొస్తయమ్మా అందమా
స్కిన్ లైటు పెట్టిన అందమా నీ స్కిన్ను పాడైతదే అందమా
షుగరొస్తే ఓ అందమా నిన్ను సూడబుద్దే కాదు అందమా
చెమటవస్తే ఓ అందమా నిన్ను చీదరించుకుంటారే అందమా
స్లిమ్ముగున్నానని ఓ అందమా నీవు చిందులేయకమ్మా అందమా"2"
బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివమ్మా అందమా
రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా "అందమా"
4.తెల్లగున్నానని అందమా తెగ మురిసిపోతున్నావే అందమా
గ్లామరున్నాదని అందమా నీవు గంతులేస్తున్నావు అందమా
రూపాలతోనే అందమా నీవు రూపాన్ని రుద్దకే అందమా
నగలేసుకోగానే అందమా నీ నడక మారిందమ్మ అందమా
వద్దు వద్దు ఓ అందమా ఇది వట్టి చెత్తమ్మ అందమా"2"
బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివమ్మా అందమా
రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా "అందమా