ఎంత ఆశ్చర్య క్రియలు | ENTHA AASCHARYAKRIYALU Song Lyrics - Bro. A R Stevenson Lyrics
Singer | Bro. A R Stevenson |
ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు
ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా
ఇంతకృప చూపించి
ఇన్నినాళ్ళు పోషించి
చింతలన్ని తీర్చిన తండ్రి నీవయ్య
అంతరంగమందున్న అంతటితో చేస్తున్న
ఆత్మీయ ఆరాధన - 2
1.కరములు బలపరచి
అడుగులు స్థిరపరచి
మట్టిపాలు కాకుండా తప్పించావు
పగిలిన గుండెలోన స్తోత్రగానమే
పదిలముగా నిండే కృపనిచ్చావు
2.కరుణను కనపరచి
వనరుల నిధి తెరచి తక్కువేమికాకుండా పంపించావు విఫలము అవుతున్న నా ప్రయత్నమూ
విజయముగా మారే కృపనిచ్చావు
3.తులువను ఘనపరచి ఫలములు వశపరచి
హద్దులేమి లేకుండా హెచ్చించావు
అడిగినవాటి కంటే శ్రేష్ఠమైనవి అధికముగా పొందే కృప నిచ్చావు