Type Here to Get Search Results !

నా ప్రాణప్రియుడా యేసురాజా | Na Prana Priyudaa Yesu Raja Song Lyrics | Dr. Asher Songs Lyrics | Hebron Songs

నా ప్రాణప్రియుడా యేసురాజా | Naa Praana Priyudaa Yesu Raja Song Lyrics - Dr. Asher Songs Lyrics

Singer Dr. Asher

నా ప్రాణప్రియుడా యేసురాజా
అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను
హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా

అద్భుతకరుడా ఆలోచన
ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహుప్రియుడా
మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ||

విమోచన గానములతో
సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్
హర్షింతును నే పాడెదను నా ప్రభువా ||నా ప్రాణ||

గర్భమున పుట్టిన బిడ్డలన్
కరుణింపక తల్లి మరచునా
మరచినగాని నీవెన్నడు
మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా ||నా ప్రాణ||

రక్షణాలంకారములను
అక్షయమగు నీ యాహారమున్
రక్షకుడా నాకొసగితివి
దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును ||నా ప్రాణ||

నీ నీతిని నీ రక్షణను
నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞతా స్తుతులతోడ
నీ ప్రేమను నే వివరింతును విమోచకా ||నా ప్రాణ||

వాగ్ధానముల్ నాలో నెరవేరెను
విమోచించి నాకిచ్చితివే
పాడెదను ప్రహర్షింతును
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||నా ప్రాణ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area