Paravasinchedha Nee Vakyamulo song lyrics | పరశించెద నీ వాక్యములో - Bro. Nissy John Songs Lyrics
Singer | Bro. Nissy John |
పల్లవి
పరశించెద నీ వాక్యములో
పరశించి నే పాడెద నీ సన్నిధిలో (2)
నీ వాక్యమే నన్ను బ్రతికించినది
నీ వాక్యమే నన్ను నడిపించినది (2)
ఆరాధన స్తుతి ఆరాధన
నా ప్రాణమైన దేవా నీకారాధన (2)
1.
నీ పాద సన్నిధిలో నేనున్నపుడు
వాక్యమనే పాలతో నను పోషించితివి (2)
నీ వాక్యమే నాకు సత్యము జీవము
నీ వాక్యమే నా పాదములకు దీపము (2)
ఆరాధన స్తుతి ఆరాధన
నా ప్రాణమైన దేవా నీకారాధన (2)
2.
ఈ లోక బంధాలు కృంగదీసినపుడు
వాక్యమనే నీ మాటతో నన్నాదరించితివి (2)
నీ వాక్యమే నను బలపరచినది
నీ వాక్యమే నీలో స్థిరపరచినది (2)
ఆరాధన స్తుతి ఆరాధన
నా ప్రాణమైన దేవా నీకారాధన (2)