prabhuva kachithivi inthakalam song lyrics |ప్రభువా… కాచితివి ఇంత కాలం | Praise and Worship Song Lyrics
Singer | Unknown |
ప్రభువా… కాచితివి ఇంత కాలం
కాచితివి ఇంత కాలం
చావైన బ్రతుకైన నీ కొరకే దేవా (2)
నీ సాక్షిగా నే జీవింతునయ్యా ||ప్రభువా||
కోరి వలచావు నా బ్రతుకు మలిచావయ్యా
మరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా (2)
నన్ను వలచావులే – మరి పిలిచావులే (2)
అరచేతులలో నను చెక్కు కున్నావులే (2) ||ప్రభువా||
నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా
ఇలలో మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా (2)
పాపము కడిగావులే – విషము విరచావులే (2)
నను మనిషిగా ఇలలోన నిలిపావులే (2) ||ప్రభువా||
బాధలను బాపితివి నీవేనయ్యా
నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా (2)
నన్ను దీవించితివి – నన్ను పోషించితివి (2)
నీ కౌగిలిలో నను చేర్చుకున్నావులే (2) ||ప్రభువా||