నిత్యుడా - నీ సన్నిధి నిండుగా | Nityuda nee sannidhi song lyrics - Ps. Ramesh Garu | Hosanna Ministries Song Lyrics
Singer | Ps. Ramesh Garu |
పల్లవి :
నిత్యుడా - నీ సన్నిధి నిండుగా నా తోడూ
నిత్యముంచి నన్ను నడిపించుమా - నడిపించుమా -2
1. నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది
నీ ఎడమ చేయి నా - తలక్రిందనున్నది -2
నీ కౌగిలిలోనే - నిత్యం నిలుపుమా -2 ॥ నిత్యుడా ॥
2. నీ సన్నిధిలో - నా హృదయమును
నీళ్ళవలే - కుమ్మరించునట్లు -2
నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా -2 ॥ నిత్యుడా ॥
3. నీ సముఖములో - కాలుచున్న రాళ్ళవలె
నీ మనస్సు నందు - నన్ను తలంచితివా -2
నీ చిత్తమే నాలో - నేరవేర్చుమా -2