ప్రభువా - నీ సముఖము నందు | Prabhuvaa Ni Samukamunandhu Song Lyrics - Sis. Nissy Paul | Hosanna Ministries Songs Lyrics
Singer | Sis. Nissy Paul |
పల్లవి :
ప్రభువా - నీ సముఖము నందు
సంతోషము - కలదు
హల్లెలూయా సదా - పాడెదన్
1.పాపపు ఊబిలో - నేనుండగా
ప్రేమతో - నన్నాకర్షించితిరే
కల్వారి రక్తంతో - శుద్ధి చేసి
రక్షించి పరిశుద్ధులతో - నిల్పి
॥ ప్రభువా ॥
2.సముద్ర - తరంగముల వలె
శోధనలెన్నో- ఎదురైనను
ఆదరణ కర్తచే - ఆదరించి
నీ నిత్య కృపలో - భద్రపరచి
॥ ప్రభువా ॥
3.సౌందర్య సీయోన్ని - తలంచగా
ఉప్పొంగుచున్న - హృదయముతో
ఆనందమానంద - మానందమాని
ప్రియునితో నేను పాడెదను
॥ ప్రభువా ॥