Type Here to Get Search Results !

నీ జీవితములో గమ్యంబు | Nee jeevitham lo gamyambu song lyrics | Old Christian Song Lyrics

నీ జీవితములో గమ్యంబు | Nee jeevitham lo gamyambu song lyrics | Old Christian Song Lyrics

Singer Unknown

నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా
ఈనాడే నీవు ప్రభు యేసుకొరకు నీ హృదయమర్పించవా (2) ||నీ జీవితములో||

నీ తల్లి గర్భాన నీవుండినపుడే
నిను చూచే ప్రభు కన్నులు (2)
యోచించలేవా ఏ రీతి నిన్ను
నిర్మించే తన చేతులు (2) ||నీ జీవితములో||

నీలోనే తాను నివసింపగోరి
దినమెల్ల చేజాచెను (2)
హృదయంపు తలుపు తెరువంగ లేవా
యేసు ప్రవేశింపను (2) ||నీ జీవితములో||

తన చేతులందు రుధిరంపు ధారల్
స్రవియించే నీకోసమే (2)
భరియించె శిక్ష నీకోసమేగా
ఒకసారి గమనించావా (2) ||నీ జీవితములో||

ప్రభు యేసు నిన్ను సంధించునట్టి
సమయంబు యీనాడేగా (2)
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరా
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరీ ||నీ జీవితములో||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area