Type Here to Get Search Results !

Neetho Samamevaru | నీతో సమమెవరు– నీలా ప్రేమించేదవరు | Raj Prakash Paul | Old Christian Songs Lyrics

Neetho Samamevaru | నీతో సమమెవరు– నీలా ప్రేమించేదవరు | Raj Prakash Paul - Sis. Jessy Paul | Old Christian Songs Lyrics

Singer Sis. Jessy Paul

నీతో సమమెవరు – నీలా ప్రేమించేదవరు
నీలా క్షమియించేదెవరు – యేసయ్యా
నీలా పాపికై ప్రాణం పెట్టిన – వారెవరు (2)

లోక బంగారము – ధన ధాన్యాదులు
ఒక పోగేసినా – నీతో సరితూగునా
జీవ నదులన్నియు – సర్వ సంద్రములు
ఒకటై ఎగసినా – నిన్ను తాకగలవా
లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన
నీవేగా చాలిన దేవుడవు ||నీతో||

పలు వేదాలలో – మత గ్రంథాలలో
పాపమే సోకని – పరిశుద్దుడేడి
పాప పరిహారార్థం – సిలువ మరణమొంది
తిరిగి లేచినట్టి – దైవ నరుడెవ్వరు
నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా
నీవేగా మంచి దేవుడవు ||నీతో||

నేను వెదకకున్నా – నాకు దొరికితివి
నేను ప్రేమించకున్నా – నన్ను ప్రేమించితివి
పలు గాయాలు చేసి – తరచు రేపితిని
నన్నెంతో సహించి – క్షమియించితివి
నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి
నీవేగా విమోచకుడవు ||నీతో



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area