కృపామయుడా నీలోనా | Krupamayuda Neelona Song Lyrics - Yesanna Garu | Hosanna Ministries Songs Lyrics
Singer | Yesanna Garu |
కృపామయుడా నీలోనా - నివసింప జేసినందునా -
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా - ఇదిగో నా స్తుతుల సింహాసనం - కృపామయుడా.... ఆ అ
1. ఏ అపాయము నా గుడారము - సమీపించనియ్యక -2
నా మార్గములన్నిటిలో - నీవే నా ఆశ్రయమైనందున -2
2. చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలచిన తేజోమయా -2
రాజ వంశములో - యాజకత్వము చేసెదను -2
3. నీలో నిలచి ఆత్మ ఫలములు - ఫలియించుట కొరకు -2
నాపైనా నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు -2
4. ఏ యోగ్యత లేని నాకు - జీవకిరీట మిచ్చుటకు -2
నీ కృప నను వీడక - శాశ్వత కృపగా మారెను -2