దూషించేవారిని సైతం | DHOOSHINCHEVAARINI Song Lyrics - Bro. Stevenson | Christian Songs Lyrics
Singer | Bro. Stevenson |
దూషించేవారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం
దేశంకై ప్రార్ధించేది క్రైస్తవ్యం
మతం కాదిది - సన్మార్గం క్రీస్తు నేర్పిన సౌశీల్యం
ఇది ప్రాచీనం - కాదు పాశ్చాత్యం
క్రైస్తవులం మేము భాగ్యవంతులం
ఏకమనసుతో దేవుని పని చేసెదం
ఖండాంతరాలు దాటి కఠిన బాధలను ఓర్చి
జీవమార్గమును ప్రకటించుటకై జీవితమును కరిగించి
హతసాక్షియాయె మన దేశంలో శిష్యుడైన తోమా
సువార్త కోసం హింసలను భరించిన క్రైస్తవ్యం క్రైస్తవ్యం
విద్యా వైద్య ఫలాలు సామాన్యులకందించి
దీన హీన జన అభ్యున్నతికై రాత్రి పగలు శ్రమియించి
వెలుగిచ్చి మిషనరీలెందరో సమిధలవ్వలేదా
ప్రాణం తీసిన వైరులను క్షమించిన క్రైస్తవ్యం క్రైస్తవ్యం
దేశాభివృద్ధి కోసం బాధ్యతతో స్పందించి
నీతి న్యాయములు స్థాపించుటకై దైవవాక్కు ప్రకటించి
కృషి చేయుచున్న దేవుని ప్రజపై నింద న్యాయమేనా
త్యాగం ప్రేమ మంచితనం ధరించిన క్రైస్తవ్యం క్రైస్తవ్యం