Type Here to Get Search Results !

యేసుని నామములో | Yesuni Nammamulo Song Lyrics | Christian Song Lyrics

యేసుని నామములో | Yesuni Nammamulo Song Lyrics - Sis. Blessy | Christian Song Lyrics

Singer Sis. Blessy

యేసుని నామములో – మన బాధలు పోవును
దుష్టాత్మలు పారిపోవును
శోధనలో జయమొచ్చును
మృతులకు నిండు జీవమొచ్చును
హృదయములో నెమ్మదొచ్చును
యేసు రక్తముకే – యేసు నామముకే
యుగయుగములకూ మహిమే
అభిషిక్తులగు తన దాసులకు
ప్రతి సమయమునా జయమే ||యేసుని||

ఘోరమైన వ్యాధులెన్నైనా
మార్పులేని వ్యసనపరులైనా
ఆర్ధికముగా లోటులెన్నున్నా
ఆశలు నిరాశలే ఐనా
ప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవు
పరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు ||యేసు రక్తముకే ||

రాజువైనా యాజకుడవైనా
నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా
ఆశ్రయముగా గృహములెన్నున్నా
నిలువ నీడే నీకు లేకున్నా
శ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నా
నీ స్థితి నేడేదైనా – నిత్యజీవము పొందెదవు ||యేసు రక్తముకే ||



Telugu Christian Songs Lyrics