Type Here to Get Search Results !

తీయని స్వరాలతో నా మనసే నిండెను | Theeyani Swaraalatho | Telugu Christian Songs Lyrics

తీయని స్వరాలతో నా మనసే నిండెను | Theeyani Swaraalatho - Harshitha | Telugu Christian Songs Lyrics

Singer Harshitha

తీయని స్వరాలతో నా మనసే నిండెను
యేసుని వరాలతో నా బ్రతుకే మారెను
భావమధురిమ ఉప్పొంగెను
రాగసుధలతో భాసిల్లెను (2)
పరవశించి నిను స్తుతించి
ఘనపరచెద వైభవముగా ||తీయని||

ఏదేమైనా ఏనాడైనా నీ దారిలో నేను
నీవే నాకు ఆప్తుడైన నిన్నాశ్రయించాను
సజీవుడా నీవే లేని నేనే వ్యర్ధము
ఏదేమైనా ఏనాడైనా నీ దారిలోనేను
యేసుతో రాజ్యము చేసే భాగ్యము
నాకు దొరికె కనికరము – తనువు పరవశము ||తీయని||

ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను
నిన్నేనమ్మి జీవించేను నీలో ఫలించేను
సహాయుడా నీలోనేగా నా సాఫల్యము
ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను
యేసుని సన్నిధి చేరే భాగ్యము
నాకు కలిగె అనుగ్రహము – తనువు పరవశము ||తీయని||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.