Type Here to Get Search Results !

సుదూరము ఈ పయనము | SUDHOORAMU EE PAYANAMU | Telugu Christian Songs Lyrics

సుదూరము ఈ పయనము | SUDHOORAMU EE PAYANAMU - Prakash | Telugu Christian Songs Lyrics

Singer Prakash

సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
నే వెంట వెల్లెదా నా రాజు వెంబడి
సుమధుర భాగ్యము యేసుతో పయనము

1.
అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
ఉల్లాసమే యేసుతో నా పయనమంతయు
ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం

2.
హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
ఏ భయము నాకు కలగదు నా పాదము తొట్రిల్లదు
నా చెంతనే ఉన్న యేసు నన్ను మోయును
ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
ఏ దిగులు లేకనే నే సాగిపోదును

3.
నా జీవితం పదిలము యేసుని చేతిలో
నా పయనము సఫలము యేసుదే భారము
నే చేరేదా నిశ్చయంబుగా నా గమ్యము
ఇది నా విశ్వాసము నాకున్న అభయము
కృపగల దేవుడు విడువడు ఎన్నడూTelugu Christian Songs Lyrics