మనసంతా నిండేలే - నా యేసురాజుని | Manasantha Nindele - Philip | Telugu Christian Songs Lyrics
Singer | Philip |
మనసంతా నిండేలే - నా యేసురాజుని ప్రేమగీతం
రోజంతా ధ్యానిస్తూ - పాడాలిలే ఓ క్రొత్త గీతం
క్రీస్తులో విశ్వాసం- ఆత్మలోన ధైర్యం
మనసులో ఆనందం నిండెగా
ఓహో... వస్తాడులే రారాజుగా నా యేసయ్యా
ఓహో... కడబూరనే మేఘాలపైనా మ్రోగగా
1. ఏమీలేని నాకు - అన్నీ నీవైనావు
శాశ్వతా ప్రేమనే - చూపినావు
నేనేమివ్వగలను నిజమైన ప్రేమకు
స్తుతియిస్తూనే ఉంటా - నా జీవితకాలము
యేసుకై....
ఓహో...వస్తాడులే రారాజగా నా యేసయ్యా
ఓహో...కడబూరనే మేఘాలపైనా మ్రోగగా
2. విశ్వాసంతో నేను - జీవిస్తాను యికపై
శాశ్వతా విడుదల - యిచ్చినావు
నా లోపాలు అన్నీ - సరిచేసినావయా
నీ దయతోనే నన్ను - బ్రతికించినావయా
యేసయ్యా...
ఓహో...వస్తాడులే రారాజగా నా యేసయ్యా
ఓహో...కడబూరనే మేఘాలపైనా మ్రోగగా