ఓ మానవా.. నీ పాపం మానవా | O Maanavaa.. Nee Paapam Lyrics | Philip patalu telugu

Singer | Philip |
ఓ మానవా.. నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి
నీ బ్రతుకు మార్చవా (2)
పాపములోనే బ్రతుకుుచున్నచో చెడును నీ దేహము
పాపములోనే మరనించినచో తప్పడు నరకము (2) ||ఓ మానవా||
ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు
ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువుు
ఎంత కాలము వ్యాసపరుడవై తిరుగుచుండువు
ఎంత కాలము దుఃఖములోనే మునిగియుండువు
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము
యేసయ్య తానా రక్తంతో నీ పాపం కడుగును (2) ||ఓ మానవా||
ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు
ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుండువు
ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
యేసయ్యే నీ పాపం కోరకు ప్రాణం పెట్టెను
యేసయ్య నిను రక్షించి పరమున చేర్చును (2) ||ఓ మానవా||