ఓ నేస్తమా | O NESTHAMA Lyrics | Bro.Stevenson patalu telugu
Singer | Bro.Stevenson |
ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా (2)
నిను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా (2)
నిను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా (2)
1. నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చినా
నీ సొంతం జనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చిన (2)
ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా (2)
నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా
నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా
2. నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కిన
నీకున్న స్వాస్ధ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా (2)
ఉద్యోగమే ఊడినా వ్యాపారంలో ఓడినా (2)
నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా
నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా