నీ రూపం నాలోనా | Nee Rupam Nalona - Adam Benny | Jesus songs lyrics in telugu
Singer | Adam Benny |
నీ రూపం నాలోనా - ప్రతిబింబమై వెలుగనీ
నీ ప్రేమా నీ కరుణా - నా హృదిలోన ప్రవహించనీ ॥2॥
రాజువు నీవే కదా - నీ దాసుడ నేనే కదా ॥2॥
ప్రభు నీకోసం ప్రతీక్షణం జీవించనీ ॥2॥
నీ రూపము నాలో ముద్రించనీ ॥2॥
॥నీ రూపం నాలోనా॥
1) నా ముందు నీవు ఎడారులన్నీ -
నీటి ఊటలుగా మార్చెదవే ॥2॥
దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా ॥2॥
ఆశీర్వాదము నీవే రాజా ॥2॥
॥నీ రూపం నాలోనా॥
2) నా పాప స్వభావం తొలగించుమయ్యా -
నీ మంచి ప్రేమ నాకియ్యుమా ॥2॥
నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి ॥2॥
హృదయాసీనుడా నా యేసయ్యా ॥ 2॥
॥నీ రూపం నాలోనా॥
3) అంధకారము వెలుగుగా మార్చి -
శాంతి మార్గములో నడిపెదవే ॥2॥
భయపడిన వేళలో తోడుగ నిలిచెదవే ॥2॥
భుజమును తట్టి నడిపెదవే ॥2॥
॥నీ రూపం నాలోనా॥