లే నిలబడు పరుగిడు | Ley Nilabadu Parugedu Song Lyrics - Sis. Sailaja | Telugu Christian Song Lyrics
Singer | Sis. Sailaja |
లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే
నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే
సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతా
నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా
నీకు తోడు నీడలాగ తండ్రి ఆత్మనివ్వలేదా
పిరికి ఆత్మనీది కాదు పరుగు ఆపకు
నీటిలోని చేపలాగా ఎదురుఈత నేర్చుకో
పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో
కదిలే నదిలా ఎదురుగా నిలబడు అలలకు జడియకు లే...
లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే
నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే
1.
రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా
పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి
యేసు బోద చేయకంటూ ఏలికలే ఏకమైతే
రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి
ఎదురు వస్తే కైసరైన ఎదురు తిరుగు నేస్తమా
బెదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా
మనసు నిండా వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు
ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు
సజ్జన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణం లే...
2.
సొంతకన్న బిడ్డలంత విడిచిపెట్టి వెళ్ళిపోతే
ఒంటరైన తల్లిమరియ నేటి స్త్రీకి మాదిరి
ఇలను సౌక్యమెంత ఉన్న పెంటతోటి పోల్చుకున్న
పరమత్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి
బ్రతుకు ఓడ బద్దలైన తగ్గిపోకు తండ్రి పనిలో
తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రిచెంతన
చెరను కూడా చింత మరచి కలము పట్టి రాసుకున్న
ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి
గోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాదిడి సత్యం… లే...