మహోన్నతుని చాటునా | Mahonnathuni Chaatuna Song Lyrics - Sis. Lillian | Telugu christian Songs
Singer | Sis. Lillian |
మహోన్నతుని చాటునా నివసించువారు
సర్వశక్తుని నీడనా విశ్రమించువారు "2"
ఆయనే నా ఆశ్రయము నా కోటయు నా దేవుడు "2"
"మహోన్నతుని"
1. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును
ఆయన తన రెక్కల క్రింద ఆశ్రయమునిచ్చును "2"
ఆయనే సత్యము కేడెము డాలును "2"
కృతజ్ఞతలర్పించుడి మనసారా ఆ రాజుకు హల్లెలూయ
కృతజ్ఞతలర్పించుడి మనసారా మహారాజుకు
"మహోన్నతుని"
2. నీకు ప్రక్కను వేయిమంది పడినగాని
నీ కుడి ప్రక్కన పదివేలమంది కూలినగాని "2"
కీడు నీ యొద్దకు ఎన్నడు రానియ్యడు "2"
"కృతజ్ఞతలర్పించుడి"
3. నీకు అపాయమేమియు రానే రాదుగా
ఏ తెగులు నీ గుడారము సమీపించదుగా "2"
ఆయన నిన్ను గూర్చి దూతలకాగ్నపించును "2"
"కృతజ్ఞతలర్పించుడి"