Type Here to Get Search Results !

కన్ను తెరిస్తే వెలుగురా | Kannu Teriste Velugura | Telugu Christian Songs Lyrics

కన్ను తెరిస్తే వెలుగురా | Kannu Teriste Velugura - SP Balu | Telugu Christian Songs Lyrics

Singer SP Balu

కన్ను తెరిస్తే వెలుగురా
కన్ను మూస్తే చీకటిరా } 2
నోరు తెరిస్తే శబ్దమురా
నోరు మూస్తే నిశబ్దమురా
ఏ క్షణమో తెలియదు జీవితం అంతం
ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం॥కన్ను తెరిస్తే॥

ఊయల ఊగితే జోల పాటరా
ఊయల ఆగితే ఏడుపు పాటరా } 2
ఊపిరి ఆడితే ఊగిసలాటరా
ఊపిరి ఆగితే సమాధి పోటురా ॥ఏ క్షణమో॥

బంగారు ఊయలా ఊగినా నీవు
భుజములపై నిన్ను మోయక తప్పదురా } 2
పట్టు పరుపు పైనా పొర్లిన నీవు
మట్టి పరుపులోనే ఎట్టక తప్పదురా ॥ఏ క్షణమో॥



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area