చాలునయా చాలునయా | Chalunaya Chalunaya Nee Krupa Kaku Chalunaya Lyrics | SP Balu | Telugu Christian Songs Lyrics
Singer | SP Balu |
చాలునయా చాలునయా
నీ కృప నాకు చాలునయా
ప్రేమామయుడివై ప్రేమించావు
కరుణా మయుడివై కరుణించావు
తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించి
ప్రేమా కరుణ నీ కృప చాలు
1. జిగటగల ఊబిలో పడియుండగా
నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా
హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా
హిమము కంటెను తెల్లగ మార్చయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సియ్యా
నా జీవితమంత అర్పింతు నీకయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు
2. బంధువులు స్నేహితులు త్రోసేసినా
తల్లిదండ్రులే నన్ను వెలివేసినా
నన్ను నీవు విడువనె లేదయ్యా
మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా
నీ సాక్షిగ నేను ఇల జీవింతునయ్యా