Type Here to Get Search Results !

ప్రేమే శాశ్వతమైన | Preme Saswathamiyna | Telugu Christian Songs Lyrics

ప్రేమే శాశ్వతమైన | Preme Saswathamiyna - Ps, John Wesly | Telugu Christian Songs Lyrics

Singer Ps, John Wesly

పల్లవి:- ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు
మనస్సే మందిరమాయె - నా మదిలో దీపము నీవే
నిన్నాశ్రయించిన వారిని - ఉదయించు సూర్యునివలెనే
నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు

1.అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరచిన - పరివర్తన క్షేత్రము
ఇన్నాళ్ళుగ నను స్నేహించి - ఇంతగ ఫలింపజేసితివి
ఈ స్వరసంపదనంతటితో - అభినయించి నే పాడెదను
ఉండలేను - బ్రతుకలేను - నీతోడు లేకుండా - నీ నీడలేకుండా
|| ప్రేమే ||

2.కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో
ఖడ్గముకంటే బలమైన నీ వాక్యము - ధైర్యమిచ్చె నా శ్రమలో
కరువుసీమలో సిరులోలికించెను - నీ వాక్యప్రవాహాము
గగనము చీల్చి మోపైన - దీవెన వర్షము కురిపించితివి
ఘనమైన నీ కార్యములు - వివరింప నా తరమా - వర్ణింప నా తరమా
|| ప్రేమే ||

3.విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో
సంబరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి
మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివి
నీ రాజ్యములో జేష్ఠులతో - యుగాయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా
|| ప్రేమే ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area