బీద విధవరాలి ప్రేమ ఎంత గొప్పది | Beeda Vidavaraali prema - I For God | Telugu Christian Songs Lyrics
Singer | I For God |
పల్లవి :- బీద విధవరాలి ప్రేమ ఎంత గొప్పది
ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకొన్నది
ఏదో కావాలని ప్రార్థించక
తానే జీవనాన్ని సమర్పించెగా
" బీద విధవరాలి"
చరణం 1:- ఒంటరితనమేమో ఎవరూ లేరేమో
బాధను దిగమ్రింగి బ్రతుకుతున్నది
చీకటిలోకంపై ఆశలు అణగారి
బీదరికంలోనే మ్రగ్గుతున్నది (2)
నడిసంద్రాన మిగిలిననావ
ఎటుపోతుందో ఎరుగదు త్రోవ
దేవుని విలువ ఎరిగిన అతివ
ఆయన పనికై చూపెను చొరవ
ఏదో ఇవ్వమని శోధించక
తానే జీవనాన్ని త్యాగమిచ్చేగా...
"బీద విధవరాలి"
చరణం 2:- కీర్తిని కోరిందా వరములు ఇమ్మందా
ఫలితం ఆశించి పనిచేసిందా...
ప్రభువును నిందిస్తూ
ప్రార్థన చేసిందా
హృదయంలోనైనా దూషించిందా... (2)
మనుషులలోన మంచిని వెదికే
ప్రభువుకు దొరికిన పావన వనిత...
మన అందరికి మాదిరిచూపే
సాక్షి సమూహపు వజ్రపు తునక
ఎంతో ధనముఉందని గర్వించక
దేహము సజీవముగా సమర్పించగా
" బీద విధవరాలి"