కన్నీట కరిగిన స్మృతులు | Kanneta Karigina Smruthulu - I For God | Telugu Christian Songs Lyrics

Singer | I For God |
కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లోఎన్నో వ్యధలు
విశ్వాసులు జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు
రాళ్ల క్రింద నలిగిన వాళ్ళు రాంపాలకు తెగిపడినోళ్లు
కత్తుల రక్తాక్షరాలు క్రీస్తుకొరకు హతసాక్షులు..
పరదేశులు యాత్రికులు తండ్రికిష్టులైన తనయులు
ఎంత యోగ్యులు.. నీతిమంతులు మార్గదర్శులు..
మాదిరి మనకుంచి పోయిన మార్గదర్శులు..
# కన్నీటి కరిగిన #
చరణం-1
పలుమార్లు ఆకలిదప్పులు అపరిమితముగా తిన్నదెబ్బలు
చెరసాలలో పొందిన యాతనలు
ఆపదలలో అనేకమారులు ప్రాణాపాయము నిందలు
జాగరణములు ఉపవాసములు
లోకమునకు నచ్చనివారు తిరస్కారములు పొందారు
సకలజనులు ద్వేషించినవారు....
కుటుంబములు కోల్పోయారు దిగంబరులుగా మారారు
కొండలలో గుహలలో బ్రతికారు
ప్రాణమిచ్చినా.. క్రీస్తు దాసులు
తమ సిలువను మోస్తూ బ్రతికిన గొప్పవీరులుఆజ్ఞ మీరని ఆత్మ పూర్ణులు.. తమపరుగును కడముట్టించిన మార్గదర్శులు..
# కన్నీటి కరిగిన #
చరణం-2
హృదయమందు భద్రము వాక్యము
ఉపద్రవము లో విశ్వాసము
అలుపెరుగని యోధుల ప్రయాణము....
సిలువను గూర్చిన ఉపదేశము లోకానికి ఎంతో అల్పము సిగ్గుపడని పాదము సుందరము....
లోకమునకు వేడుకవారు. దినదినము చనిపోయారు. శరీరాలను సిలువేశారు....
జనుల మెప్పు కోరనివారు. వధకు సిద్ధమే అయినారు. తుదకు ప్రభువులో మృతిపొందారు..
ధన్యజీవులు, సర్వశ్రేష్ఠులు, గొర్రెపిల్ల పెండ్లివిందుకు వారే అర్హులు. పరిశుద్ధులు, యాజకులు, పరమతండ్రి ఆలయములో స్థంభములు....
# కన్నీట కరిగిన #