Type Here to Get Search Results !

నీదు ప్రేమ నాలో ఉంచి జీవమునిచ్చావు | Needu prema nalo unchi | Telugu Christian Songs Lyrics

నీదు ప్రేమ నాలో ఉంచి జీవమునిచ్చావు - Jessy Paul | Telugu Christian Songs Lyrics

Singer Jessy Paul

నీదు ప్రేమ నాలో ఉంచి జీవమునిచ్చావు
నీదు రూపమే నాలో ఉంచి నన్ను చేసావు
మంటివాడను నన్ను నీవు మహిమపరిచావు
మరణపాత్రుడనైన నన్ను పరము చేర్చావు
ఎంత ప్రేమ యేసయ్యా – నీకెంత నాపై కరుణయో
మరువగలనా నీ కృప – బ్రతుకంతయు (2)

తోడువైనావు నా నీడవైనావు
నీవు నాకు ఉండగా నాకు ఈ దిగులెందుకు
మంచి కాపరి నీవేనయ్యా నా యేసయ్యా
ఎంచలేనయ్యా నీ వాత్సల్యం ఓ మెస్సయ్యా
జీవితమంతా మరువలేనయ్యా ||నీదు ప్రేమ||

ప్రాణమైనావు నీవే ధ్యానమైనావు
అన్నీ నీవై చేరదీసి ఆశ్రయమైనావు
నీతిసూర్యుడా పరిపూర్ణుడా నిత్య దేవుడా
కీర్తనీయుడా కృపాపూర్ణుడా సత్యజీవుడా
నేను నిన్ను విడువలేనయ్యా ||నీదు ప్రేమ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area