నీతోనే నడిచెదనయ్యా - Bharath | Telugu Christian Songs Lyrics
Singer | Bharath |
నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా
ఎదురు గాలులే నాపై వీచినా
జీవిత అలలే నన్ను ముంచినా
నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా
1. కన్నీటి సముద్రాన మునిగియున్నా
ఏ తోడు లేక తిరుగుచున్నా
నాకున్న ఒక్క ఆశ నీవేనయ్యా
మిగిలున్న ఒక్క ఆశ నీవేనయ్యా
2. అనాధుల దైవము నీవేకద దేవా
నా చేయి విడువను అంటివి కద దేవా
నను దాటి పోకుము దేవా
నా చేయి విడువకు దేవా