ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన - Bro Stevenson | Telugu Christian Songs Lyrics
Singer | Bro Stevenson |
ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన
మహనీయుడైన మహారాజుకు
పరలోక పరిశుద్ద యెహోవాకు
ఉన్నతలోకమందున సమీపింపరాని తేజస్సున "1"
అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు "1"
అదృశ్యుడు అనంతుడు అద్వితీయ దేవుడు "2"
ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవకు "2"
పరలోక పరిశుద్ధ దూతలు పరిశుద్ధుడంచు పాడిన
ఇరువది నలుగురు పెద్దలు సాగిలపడి పూజించిన
పరలోకము భూలోకము సంద్రము ప్రతి సృష్టము
స్త్రోత్రమంచు పాడిన పూజ్యుడగు యెహోవకు
రాజులకు రారాజుడే ప్రభువులకు మహాప్రభు
ఆది మధ్య అంతముల్ లేని నిత్య దేవుడు
సకల సృష్టికర్తయై సర్వాధికారి ఆయనే
యుగయుగములు మార్పు లేని
మహిమగల యెహోవకు