కృప కృప నా యేసు కృపా - Bro. Anil - Jesus Songs Telugu Lyrics- Krupa Krupa Na Yesu Krupa Song Lyrics

Singer | Bro. Anil |
కృప కృప నా యేసు కృపా
కృప కృప కృపా (2)
నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే
నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే
నేనేమైయుంటినో అందుకు కాదయ్యా
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా
చూపావు ప్రేమ నాపై – పిలిచావు నన్ను కృపకై
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా
నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప||
నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా
కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా
రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా
నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా
నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై – నన్నాకర్షించావయ్యా
నువ్వులేని నన్ను ఊహించలేను – నా శిరస్సు నీవయ్యా
నా గుర్తింపంతా నీవే యేసయ్యా
నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో||
నా పాపము నను తరుమంగా నీలో దాచితివే
నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే
నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే
ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే
నీ మంచితనమే కలిగించె నాలో – మారు మనస్సేసయ్యా
నేనెంతగానో క్షమియించబడితిని – ఎక్కువగా ప్రేమించితివయ్యా
నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా
నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో||
పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా
నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా
నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా
నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా
ఏముంది నాలో నీవింతగా నను – హెచ్చించుటకు యేసయ్యా
ఏమివ్వగలను నీ గొప్ప కృపకై – విరిగిన నా మనస్సేనయ్యా
నీ కొరకే నేను జీవిస్తానయ్యా
మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో||
పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా
అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా
నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా
విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా
నీలోన నేను నాలోన నీవు – ఏకాత్మ అయితిమయ్యా
జీవించువాడను ఇక నేను కాను – నా యందు నీవయ్యా
నీ మనసే నా దర్శనమేసయ్యా
నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో||