యేసయ్యా నీ ప్రేమ – నా ధ్యానం - Yesayya Nee Prema Naa Dhyaanam Song Lyrics - Telugu Christian Song Lyrics
Singer | M M Srilekha |
యేసయ్యా నీ ప్రేమ – నా ధ్యానం
యేసయ్యా నీ మాట – నా దీపం
పసి ప్రాయముల నీదు ఒడిలో
నివసించెదను చిరకాలములు ||యేసయ్యా||
గాలి వానలో వెలిగే దీపం ఆరదా?
ప్రయాణ చీకటిలో నీదు దీపం ఆరదు
నీ మాటలే నా జీవం
నీ వెలుగే నా ప్రాణం
నీ గానమే నా పాణం
నీ రూపమే నా దీపం ||యేసయ్యా||
విశేష ఆరాధన గీతం నీకే నా ప్రభు
అపురూప భావాలతో రాగం నీకే అంకితం
నీ పరలోకం చూడాలని
నీ దర్శనం నే పొందాలని
నీ స్వరమే నే వినాలని
ఆశించెద ప్రతి క్షణము ||యేసయ్యా||